మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే
తడవుగా నేనేం చేయను
మధువనం విరిసెలే మధురము పొంగేలే
మతి పోతే నేనేం చేయను
మెత్తనైనా దూదల్లే ఎగిరేటి నా మదిని
ఆపేది ఎట్టాగ ఓదార్చే దెట్టాగా
కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెల్లెల్లే
నన్ను కోలుపోయాను అయినా మేలూ అన్నాను
నిప్పు మీద కొంచెం నీటి మీద కొంచెం
తడబడుతూ నిలిచే నా హృదయం
మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే
తడవుగా నేనేం చేయను
మధువనం విరిసెలే మధురము పొంగేలే
మతి పోతే నేనేం చేయను
మిస మిస కళ్ళతో మదినే తొలిచేలే
బాధైనా ఏదో సుఖం ఏదో సుఖం
బుగ్గల సొట్టలో కొలువుందన్నది
విలువైన దివ్య వరం
వెన్నెలొలుకు వేళల్లో కళలు కనే కాలంలో
చెలియా తానే వచ్చెనులే చెంత చేరుకున్నదిలే
రెప్ప మూత పడుకుంది నిద్దరసాలు రానంది
అదే గనక ప్రేమైతే చెలియా వలన కలిగింది
అడుగేసే ముందు అడుగు తీసే వెనక
ఆణువణువూ నీ జ్ఞ్యాపకం
కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలని వెతుకును తేనెటీగ
వర్షం వస్తే నీరే చేరును భూమి లోన
కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలని వెతుకును తేనెటీగ
వర్షం వస్తే నీరే చేరును భూమి లోన
హే ఎటు నువ్వు నిలుచున్నవో ఆటే నేను చూస్తుంటాను
ముందు వెనక నీ నడ్డకాల్లో ఊయల లూజ్
ఆడే నెమలి నీ పించం నా మీదే
సుఖమే కలిగే ఇక పైన జీవితమే
మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే
తడవుగా నేనేం చేయను
మధువనం విరిసెలే మధురము పొంగేలే
మతి పోతే నేనేం చేయను
మెత్తనైనా దూదల్లే ఎగిరేటి నా మదిని
ఆపేది ఎట్టాగ ఓదార్చే దెట్టాగా
కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెల్లెల్లే
నన్ను కోలుపోయాను అయినా మేలూ అన్నాను
నిప్పు మీద కొంచెం నీటి మీద కొంచెం
తడబడుతూ నిలిచే నా హృదయం