ఏంచేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది
ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
నిను చేరి జతగా ఆడాన సరదాల కెలికి
ఇక చూడు రోజు అయిపోదా సరసాల హాయ్
నీ ఆలనలో నీ లాలనలో
ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా
ఏంచేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది
ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
పాపాయల్లే నా ముందు కుదురుగా కూర్చుంటే
పుత్తడి బొమ్మగా నిన్ను దిద్ది దిష్టే తీయ్యనా
పిల్లాడల్లే అల్లరిగా పరుగులు తీస్తుంటే
కళ్ళను మూసి నలుగద్ది లాలా పోయన
నునడిచి అలసి పోతుంటే నా చేతులే నిను మూసెను
ను కథలు చెప్పమని అంటే మన కదనే వినిపిస్తాను
ఏ చింత లేదంట నీ చెంత నుంటే
ఏ భాగ్యం కావలి నాకింత కంటే
ఈ దొరసాని నా అలివేణి
ఇక లోకంలో ఏదైనా పోతే పోనీ
ఏంచేసావో నా ప్రాణం (నీ చుట్టే వుంది )
ఏదేమైనా జీవితమే (నీదని చెబుతుంది )
స్వాతి చినుకుల ముత్యలే దోసిలిలో నింపి
మురిపెం తీరా నీపైన ముద్దుగా చల్లన
చిరు మేగంలో ఏడేడు రంగులనే తెచ్చి
మరు నిమిషంలో నీచెయ్యి గాజులే చెయ్యన
కను రెప్పలాగా నీవుంటే కనుపాపై నిద్దరోతాను
మునిమాపు వేళా చలి వేస్తే నిన్ను అల్లుకు పోతానేను
అమావాస్యలే లేవంట నీవెదుట ఉంటే
అమ్మల్లే తినిపిస్త అలిగి నావంటే
ఓ స్నేహితుడా నా సహచరుడ
ఇక నూరేళ్లు నువ్వే నా తోడు నీడ
ఏంచేసావో నా మనసు నీదై పోయింది
ఏదేమైనా నిన్ను వదిలి రానని అంటుంది
ఏంచేసావో నా ప్రాణం నీ చుట్టే వుంది
ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది
నిను చేరి జతగా ఆడాన సరదాల కెలి
ఇక చూడు రోజు అయిపోదా సరసాల హోలీ
నీ అలనాలో నీ లాలనలో
ఇక నాకన్నా మహారాణి వేరే ఉందా