నైలు నది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే నిను కలవలేని నా కలల వనం
ఎదలో ఆకాశాన్నంటే కేరింత జతగా నే నీతోపాటే లేనంటా
వలపిది ఇంతే ఎన్నటికైనా ఏదో చాలని కొరతేగా
విడివిడి విరహపు అలజడిలోన ప్రతి ఒక తలపు తీయని కవితేగా
నైలు నది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే నిను కలవలేని నా కలల వనం
అద్దం ముందు ఉన్నదీ అందని మెరుపూ
అందం వైపు లాగుతున్నదీ తెరిచిన తలుపూ
నాలుగు గోడలే అంచులుగా మరో లోకం వెలిసింది
అయినా ఆగని అల్లరిగా నా మది నీకై వెతికింది
పెరిగిన దూరం మరికొంచం ప్రేమని పెంచింది ఓ ఓ
నైలు నది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే నిను కలవలేని నా కలల వనం
ఇక్కడున్న నేనిలా రెక్కలు తొడిగా
రెప్పపాటు వేగమై నీ పక్కన ఒదిగా
మూసిన కన్నుల స్వప్నంగా సమీపిస్తా సరసంగా
రంగులు పూసిన వెన్నెలగా సముదాయిస్తా సరదాగా
ఎన్నాళ్ళైనా ఎడబాటు ఓ కొన్నాళ్ళేగా ఆ ఆఆ