కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళీ పుట్టానే
నీ కనులా కెరటములోనా చూపులిలా మునిగినవేమో
చిక్కానే చేపై నే తీగలు లేని ఈ వల్లో
నెమ్మదిగా నువ్వొదిలే నవ్వుల గాలాల్లో ఓ ఓ
కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళీ పుట్టానే
ఓ హో నువ్వొచ్చి నా ప్రపంచమౌతుంటే
ప్రపంచమే వెనక్కి పోతుందే
నువిచ్చిన కలల్లో నేనుంటే వసంతమే తలొంచుకుంటుందే
అడగాలే గాని జీవితమైనా ఆ క్షణమే నీకై రాసిచ్చెయ్నా
చిక్కానే చేపై నే తీగలు లేని ఈ వల్లో
నెమ్మదిగా నువ్వొదిలే నవ్వుల గాలాల్లో ఓ ఓ
కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళీ పుట్టానే
ఓ హో వయస్సులో ఎరక్క నేనున్నా
సొగస్సులో ఇరుక్కుపోతున్నా
మనస్సులో నిజంగా నీ పేరే
తపస్సులా స్మరించుకుంటున్నా
ఎదురై నీ రూపం నించొని ఉంటే
ఎగిరెళ్ళి నింగి అంచున ఉంటా
తాకే వీల్లేకున్నా నిన్నందుకుంటున్నా తలుకా తలుకా
కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే ఇంకోలా నే మళ్ళీ పుట్టానే ఓఓ ఓ ఓఓ