నిప్పు ఉంది నీరు ఉంది
నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది
నగాదారిలో
పారే ఏరు దూకిందంట
నగాదారిలో
రగిలే అగ్గి కొండ సల్లారింది
నగాదారిలో
కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి నేడు
తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది
జన్మే నాది ధన్యమాయేరో
నిప్పు ఉంది నీరు ఉంది
నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది
నగాదారిలో
పారే ఏరు దూకిందంట
నగాదారిలో
రగిలే అగ్గి కొండ సల్లారింది
నగాదారిలో
ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్న గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్థం అవ్వదా
సత్యం అన్నది
కోరుకున్న బ్రతుకు బాటలో
నన్ను చూసి నిందలేసిన
బంధనాలు తెంచి వేసిన
నిన్నే చేరగ
అడవే ఆడిందిలే
నీవే వశమై
కలతే తీరిందిలే
కలయి నిజమై
హృదయం మురిసిందిలే
చెలిమే వరమై
నడకే సాగిందిలే
బాటే ఎరుపై
నిప్పు ఉంది నీరు ఉంది
నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది
నగాదారిలో
పారే ఏరు దూకిందంట
నగాదారిలో
రగిలే అగ్గి కొండ సల్లారింది
నగాదారిలో