కోలు కోలో కోలోయమ్మ కొమ్మా చివరన పూలు పూసే కోలో
పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే