ప్రేయసి కావూ నేస్తం కావూ
గుండెల్లో నిండున్నావూ
గుప్పెట్లో దాగున్నావూ
చీకట్లో వెలుగిస్తావూ
జగమంతా కనిపిస్తావూ
పండుగ నీవూ నా పచ్చిక నీవూ
పండుగ నీవూ నా పచ్చిక నీవూ
మొహమే మంటగా రగులుతున్న
లోకమే నీవుగా మునిగిఉన్నా
గాలిలో ఈకలా తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరిఉన్నా
నీ శ్వాస కోసం మానై ఉంటా
నీ మాట కోసం మునినై పోతా
నీ చూపు కోసం శిలనై ఉంటా
నీ నవ్వు కోసం అలుసై పోతా
జాబిలికే వెన్నల నీవూ
సూర్యునికి వేకువ నీవూ
ఊపిరిలో ఉష్ణం నీవూ
ఊరించే తృష్ణమ్ నీవూ
సూన్యం నీవూ నా శోకం నీవూ
సూన్యం నీవూ నా శోకం నీవూ
వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలి రావా
నిర్ణయం చెప్పీ నన్నాదుకోవా
నీ తోడు కోసం ఆవిరై పోనా
నీ స్పర్శ కోసం చినుకై రానా
నీ అడుగు తాకీ గుడినై పోనా
నీ గుండెలోకి సడినై రానా
నీలానికి నింగివై నీవూ
కాలానికి గమ్యం నీవూ
చలనానికి శక్తివి నీవూ
భావానికి మూలం నీవూ
ఎవరికోసం ఈ జాబిలీ దేశం
కమ్మని కావ్యం ఈ వెన్నల దీపం
ఎవరికోసం ఈ జాబిలీ దేశం
కమ్మని కావ్యం ఈ వెన్నల దీపం