• Song:  Gaali Chirugaali
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా కనురెప్ప మూసి ఉన్నా నిదరొప్పుకోను అన్నా నిను నిలువరించేనా ఓ స్వప్నమా అమవాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా తన ఒడిలో ఉన్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మా ఉలి గాయం చెయ్యకపోతే ఈ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరదా గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీ రాక ఆపేనా వాసంతమా ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముల్లైనా బెదిరేన నీ వానా ఆషాడమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటె చాలు సుమా కలకాలం నిన్ను అనచదు మన్ను ఎదిగే విత్తనామా సాగిపో నేస్తమా నిత్యమూ తోడుగా నమ్మకం ఉందిగా ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gaali chirugaali ninu choosindevaramma Velle nee daari Adi yevariki telusamma Roopame undani Oopire nuvvani Ennadu aagani Payaname needani Gaali chirugaali Ninu choosindevaramma Velle nee daari Adi yevariki telusamma Kanureppa moosi unnaa Nidaroppu konu annaa Ninu niluvarinchenaa O swapnamaa Amavaasalennainaa Grahanaalu evainaa Nee kalanu dochenaa O chandramaa Tana odilo unnadi Raayo ratnamo Polchadu nelamma Uli gaayam cheyyakapote Ee shila shilpam kaadamma Meluko mitramaa Gundelo jwaalale Jyotigaa maaragaa Cheekate daarigaa Vekuve cheradaa Gaali chirugaali Ninu choosindevaramma Velle nee daari Adi yevariki telusamma Chali kanche kaapunnaa Pogamanchu pommannaa Nee raaka aapenaa Vaasantamaa Ye konda raallainaa Ye kona mullainaa Bedirena nee vaana Aashaadamaa Molakette pachchani Aashe neelo Unte chaalu sumaa Kalakaalam ninnu Anachadu mannu Edige vittanamaa saagipo nestamaa Nityamu todugaa Nammakam undigaa Orime sakshigaa Otame odagaa Gaali chirugaali Ninu choosindevaramma Velle nee daari Adi yevariki telusamma Roopame undani Oopire nuvvani Ennadu aagani Payaname needani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vasantham
  • Cast:  Aakash,Aarthi Agarwal,Kalyani,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2003
  • Label:  Aditya Music