కోపమా నాపైన ఆపవ ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలన
చాలులే నీ నటన సాగవే ఇటు పైన
ఎంతగా నసా పెడుతున్నా లొంగి పోనే లాలన
దరి చేరిన నెచ్చెలిపైనా దయ చూపావా కాస్తైనా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా
ఓ కస్సుమని ఖారంగ కసిరినది చాలింక
ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడ దాకా కలిసి అడుగెయ్యవుగా
కన్నుల వెనకే కరిగిపోయే కలవి కానుకా
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావ
నువ్వు గొడుగునే ఎగరేస్తావే జడివాన హోం
హో కోపమా నాపైన ఆపవ ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలన
తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమె గా
మనసులోని చెలియా బొమ్మ చెరిపిన చేరగదు గనుక
సులువుగ నీలాగా మర్చిపోలేదింకా మనసు విలువ
నాకు బాగా తెలుసు గనక
ఎగసే ఆలా ఏనాడైనా తన కడలిని విడిచేనా
వొదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హోం
కోపమా నాపైన ఆపవ ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలన