• Song:  Yeduta Nilichindi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik

Whatsapp

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ అవునో కాదో అడగకంది నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధం అల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ వినేవారు లేక విసుక్కుంది నా కేక నీదో కాదో వ్రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమా వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు
Yeduta nilichindi choodu Jalathaaru vennelemo Yedanu thadipindi nedu Chinukanti chinnademo Maimarachipoyaa mayalo Pranamantha meetuthunte Vaana veenalaa Yeduta nilichindi choodu Nijamlaanti ee swapnam Elaa patti aapali Kale aithe aa nijam Ela tattukovaalee Avuno kaado Adagakandi na mounam Chelivo shilavo Theliyakundi nee roopam Chelimi bandham allukunde Janma khaidulaa Yeduta nilichindi choodu Ninne cherukolekaa EteLlindo na lekha Vinevaaru lekaa Visukkundi na keka Needo kaado Vrasunna chirunaamaa Vundo ledo Aa chota na premaa Varamlaanti shapamedo Sonthamaindilaa Yeduta nilichindi choodu Jalathaaru vennelemo Yedanu thadipindi nedu Chinukanti chinnademo Maimarachipoyaa mayalo Pranamantha meetuthunte Vaana veenalaa Yeduta nilichindi choodu
  • Movie:  Vaana
  • Cast:  Meera Chopra,Vinay Rai
  • Music Director:  Kamalakar
  • Year:  2008
  • Label:  Aditya Music