అనగా అనగనగ కనులే కలగనగా
నిజమయ్యే మెరుపల్లే వాలెగా
నా ఊపిరి నడక తన ఊపిరి జతగ
కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా
అరెరే అరెరె మనసే అదిరే
నీవల్ల నాలోన ఈ అల్లరే
ఎవరే ఎవరే కుదురే చెదిరే
తొలిసారి తనువంత ఓ జాతరే
ఆరాటము మెహమాటము
జతగా కలిగే నాకెందుకో
అలవాటులో పొరపాటుగా
నను నేను దాస్తున్నానెందుకో
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే
నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా
నీ పాదమే దాటు ప్రతి చోటున
నీ పెదవులు తాకే నా పేరును వింట
ఓ స్పర్శకే పొంగి పోతానట
కాలం కలిపింది ఈ జోడి బాగుందని
ప్రాణం అడిగింది నీతోడు సాగాలని
దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది
ఒకటవ్వనే ఓఓ ఓ ఓ
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే
ఆకాశం తానే చినుకల్లే మారి
అక్షింతలై పైన రాలాయిగా
ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం
మోగాయిలే మేళతాళాలుగా
రాయబారాలు పంపాను నా భాషలో
రాయలేనన్ని భావాలు నా ఊహలో
మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది
ఈ ప్రేమలో ఓఓ ఓ ఓ
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే