దిగు దిగు జాబిలి దివి దిగి నువ్వు రావాలి
సొగసుగా రాతిరి నిగ నిగ నవ్వు కోవాలి
కన్నరగించే విందుగా నమ్మేదెలా అన్నంతగా
నిశిలో దిశలో తళుకుమనద
దిగు దిగు జాబిలి దివి దిగి నువ్వు రావాలి
సొగసుగా రాతిరి నిగ నిగ నవ్వు కోవాలి
లేళ్ళు పులులు వైరం మరచి స్నేహం నదిలో దూరం విడిచి
చేరువై మురిపించావా
రాళ్ళూ లతలు నేస్తం కలిపి గాలుల జడిలో నాట్యం జరిపి
వారేవా అనిపించవా
జరిగింది మాయే అనుకుంటే అది నీవల్లే
నడిచింది సమయం నీవెంటే పసి పాపల్లె
కల లాంటి ఈ నిజం నీలాంటి అద్భుతం
అడుగుడగు ఉలికి పడదా
దిగు దిగు జాబిలి దివి దిగి నువ్వు రవళి
సొగసుగా రాతిరి నిగ నిగ నవ్వు కోవాలి
ముందు మునుపు ఈ మైమరపో ఎపుడైనా కలిగిందా చెప్పు
ఇప్పుడే మొదలైనదా
ఎదో పిలుపు విని నీ తలపు తరిమిందేమో నిన్నిటువైపు
ఎందుకో చెబుతున్నాడా
మెరుగైన కాలం కలిసొస్తే ఇది ఇంతేలే
అనుకోని హాయే కలిగిస్తే గిలిగింతేలే
ఏ వయసు నిదురకి తోలి పొద్దు పొడిపిది
అణువణువూ చురుకు మనదా
జిలిబిలి జాబిలి జిలుగులు వెంట రావాలి
చలి చలి రాతిరి చలువల మంతకగలి
కన్నరగించే విందుగా నమ్మేదెలా అన్నంతగా
నిశిలో దిశలో తళుకుమనగా
దిగు దిగు జాబిలి దివి దిగి నువ్వు రావాలి
సొగసుగా రాతిరి నిగ నిగ నవ్వు కోవాలి