• Song:  Kolo Kolanna
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Armaan Malik,Harini,Srikrishna

Whatsapp

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏముంది చూడాలేగాని మన్నే రంగుల పూదోటవుతుంది తోడై నీవెంట కడదాకా నేనుంటా రాళ్ళైనా ముళ్ళైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే నిను వెంటాడే దిగులే వెళిపోతుందా యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి చినచిన్న ఆనందాలు చిన్నబోని అనుబంధాలు అపుడపుడూ చెక్కిలిగింతలు పెడుతుండగా కలతా కన్నీళ్లు లేని చిననాటి కేరింతల్ని చిటికేసి ఇటురమ్మంటూ పిలిపించగా కదిలొస్తూ ఉంది చూడు కన్నులవిందుగా ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగా హా నలుగురితో చెలిమి పంచుకో చిరునగవు సిరులు పెంచుకో జడివానే పడుతున్నా జడిసేనా తడిసేనా నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే నిను వెంటాడే దిగులే వెళిపోతుందా యమ ధీమాగా ఎదురెళ్ళి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా నీలోను నాలోనూ ఈ నేలేగా అమ్మై ఉంది అంతా అయినోళ్లేగాని పరులెవ్వరూ మనలోని చుట్టరికాన్ని మరిపించే ఈ దూరాన్ని చెరిపే వీలుందంటే కాదనరెవ్వరూ ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా పదిమందికి ఆనందం పంచకపోదుగా ఆ ఆ తగిన వరసైన తారక తెరలు విడి ధరికి చేరగా ప్రతి నిత్యం పున్నమిగా అనుకోదా నెలవంకా కలలన్నీ విరియగ విరిసిన వెన్నెలగా నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే ఓ ఓ నిను వెంటాడే దిగులే వెళిపోతుందా యమ ధర్జాగా ఎదురెళ్ళి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
Kolo Kolanna Kolo Kommalu Kilakila Navvaali Kovello Velige Jyothulu Kallallo Koluvundaali Aaraaru Ruthuvulloni Akkarlenidhi Emundhi Choodaalegaani Manne Rangula Poodhotavuthundhi Thodai Neeventa Kada Dhaaka Nenuntaa Raallainaa Mullainaa Mana Adugulu Padithe Poolai Pongaalaa Nuvu Dheenamgaa Ye Moolo Koorchunte Ninu Ventaade Dhigule Velipothundaa? Yama Dhairyamgaa Edhutelli Niluchunte Ninnedhirinche Bedhurinkaa Untundhaa Kolo Kolanna Kolo Kommalu Kilakila Navvaali Kovello Velige Jyothulu Kallallo Koluvundaali China Chinna Aanadhaalu Chinnaboni Anubandhaalu Apudapudu Chekkiliginthalu Peduthundagaa Kalathaa Kanneellu Leni Chinanaati Kerinthalni Chitikesi Iturammantu Pilipinchagaa Kadhilosthu Undi Choodu Kannulavindhugaa Oorandharnee Kalipe Ummadi Pandugaa Haa Naluguritho Chelimi Panchuko Chirunagavu Sirulu Penchuko Jadivaane Paduthunnaa Jadisenaa Thadisenaa Nee Pedhavulapai Chirunavvulu Epudainaa Nuvu Dheenamgaa Ye Moolo Koorchunte Ninu Ventaade Dhigule Velipothundaa Yama Dheemaagaa Edhutelli Niluchunte Ninnedhirinche Bedhurinkaa Untundhaa Neelonu Naalonu Ee Nelegaa Ammai Undhi Anthaa Ayinollegaani Parulevvaru Manaloni Chuttarikaanni Maripinche Ee Dhooraanni Cheripe Veelundhante Kaadhanarevvaru Oka Puvvu Vichhina Gandham Oorike Podhugaa Padhimandhiki Aanandham Panchakapodhugaa Aa Aa Thagina Varasaina Thaaraka Theralu Vidi Dhariki Cheragaa Prathinithyam Punnamigaa Anukodhaa Nelavankaa Kalalannee Viriyagaa Virisina Vennelagaa Nuvu Dheenamgaa Ye Moolo Koorchunte Ninu Ventaade Dhigule Velipothundaa Yama Dharjaagaa Edhutelli Niluchunte Ninnedhirinche Bedhurinkaa Untundhaa Kolo Kolanna Kolo Kommalu Kilakila Navvaali Kovello Velige Jyothulu Kallallo Koluvundaali
  • Movie:  Tuck Jagadish
  • Cast:  Nani,Ritu Varma
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Aditya Music