ఇచ్చేసుకుంటాలే
నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేసుకుంటాలే
నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే
కొప్పుల్లో ఓ మల్లెచెండులా
నిన్ను ముడిచేసుకుంటాలే
బువ్వలో ఉల్లిపాయలా
నిన్ను కొరికేసుకుంటాలే
నా పంచ ప్రాణాలు
నా ముద్దుమురిపాలు
ముడుపల్లె కట్టాను నీకోసమే
నువ్వొచ్చీ రాగానే నీకిచ్చుకోకుంటే
నా మనసు తిడతాదిలే
ఇన్నాళ్లు ఈ సిగ్గు ఏ సంతకెళ్ళిందో
ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే
గుండెల్లో ఉన్నోడు గుమ్మంలోకొచ్చాడు
అని ఎవరో చెప్పుంటారే
చెప్పింది నాతో ఈ తాళిబొట్టు
తనలోన నిన్నే దాచేసినట్టు
పట్టింది అంటే హా ఆ ఆ ఈ చెమట బొట్టు
నీ చూపు నన్నే చుట్టేసినట్టు
హే ఎక్కువ చప్పుడు చెయ్యొద్దు అంటూ
పట్టీల కాళ్ళట్టుకోవాలే
అల్లరి కొంచం తగ్గించమంటు
గాజుల్ని బతిమాలుకోవాలే
కావిళ్ల కొద్దీ కౌగిళ్లు తెచ్చి
మన మధ్య పొయ్యాలే
ఇచ్చేసుకుంటాలే
నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేసుకుంటాలే
నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే
నా ఒంటిమీద నీ గోటిముద్ర
చెరిపేసేనంటా నా కంటినిద్ర
నా గుండె పైనా మ్ మ్ నీ వేలిముద్ర
దాచేది ఎట్టా ఓ రామసెంద్రా
హే రేయిని తెచ్చి రాయికి కట్టి
మనతోటే ఉంచేసుకోవాలే
తెల్లారిందంటూ కూసేటి కోడిని
కోసేసి కూరండుకోవాలే
నా బొట్టుబిళ్లకి రెక్కలు వచ్చి
నీ మీద వాలాలే
ఇచ్చేసుకుంటాలే
నన్ను నీకిచ్చేసుకుంటాలే
తెచ్చేసుకుంటాలే
నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే
పిచ్చిగా నచ్చినట్టుగా
నిన్ను పిలిచేసుకుంటాలే
చక్కగా మొక్కజొన్నలా
నిన్ను ఒలిచేసుకుంటాలే
నా పంచ ప్రాణాలు నా ముద్దుమురిపాలు
ముడుపల్లె కట్టాను నీకోసమే
నువ్వొచ్చీ రాగానే నీకిచ్చుకోకుంటే
నా మనసు తిడతాదిలే
ఇన్నాళ్లు ఈ సిగ్గు ఏ సంతకెళ్ళిందో
ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే
గుండెల్లో ఉన్నోడు గుమ్మంలోకొచ్చాడు
అని ఎవరో చెప్పుంటారే