పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం
అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం
మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా
ఉసురేమో నాదైనా
నడిపేదే నీవుగా
కసురైన విసురైన
విసుగైన రాదుగా
పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం
అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం
ఏదో సంగీతమె
హృదయమున ఎంతో సంతోషమే
క్షణములో గాల్లో తేలిన భ్రమే
తిరిగి నవ్వింది ప్రాయమే
ఏదో సవ్వడి విని
టక్కుమని తిరిగాలే నువ్వని
మెరుపులా నువ్వొస్తున్నావని
ఉరుకులో జారె ప్రాణమే
నీపేరే పలికినదో
ఏ మగువైన తగువేనా
నా గాలే తాకినదో
చిరుగాలైన చంపెయ్ నా
హెచ్చరిక చేసినా నీకు నీడయ్యెరా
వెన్నెలను నిన్ను వదలమని వైరం
ప్రతి నిమిషమునా
హక్కులివి నాకు మాత్రమవి సొంతం
ఇలా నీపైనా
మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా
పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం
అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం