సాగిపోయే నీలి మేఘం
నను వీడదాయే ప్రేమ దాహం
కన్నీరే మిగిలిందిక నేస్తం
నువ్వు లేని నా బ్రతుకే సూన్యం
నీ ఊహలో నన్ను జీవించని
నీ రూపమే నన్ను ధ్యానించని
తలపే పిలుపై చెలియా వినపడని
కన్నీరే మిగిలిందిక నేస్తం
నువ్వు లేని నా బ్రతుకే సూన్యం
పెంచుకున్న ప్రేమ కోసమే
పంచుకున్న ప్రేమ కోసమే
పంజరానా రామ చిలుక చిక్కుకున్నది
కన్నవారు కత్తి దూసినా
కుల మతాల చిచ్చు రేపిన
నమ్ముకున్న ప్రేమ కోసమే బ్రతికి ఉన్నది
ఆశల రెక్కలు నెలకు రాలిన ఈ నిమిషం
చిమ్మని చీకటి కమ్ముకు పోయిన ఈ సమయం
చిగురాకుల పూ పొదలో
చెలరేగిన జ్వాలలలో
వసి వాడి పోయే లేత యవ్వనమే
కన్నీరే మిగిలిందిక నేస్తం
నువ్వు లేని నా బ్రతుకే సూన్యం
మనసులోని బాధ తీరదు
పెదవి దాటి మాట సాగదు
నీవు లేని నాడు నాలో ప్రాణముండదు
కళల మేడ కూలిపోయిన
తనువు నెల వాలిపోయిన
చివరి చూపు చూడకుంటే శ్వాస ఆగదు
తీరని వేదన ఉప్పెన రేగిన ఈ జడిలో
చిక్కని నెత్తుటి ధారాలుకారిన నా హృది లో
పలికిందిక నా గతము మరణానికి స్వాగతము
నిను చూడలేని జన్మ వ్యర్థమని
కన్నీరే మిగిలిందిక నేస్తం
నువ్వు లేని నా బ్రతుకే సూన్యం