పవిత్ర ధాత్రి భారతాంబా
ముద్దు బిడ్డవవురా
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ
వీలు లేని వీర
రేనాటి సీమ కన్న సూర్యుడా
మృత్యువే స్వయానా
చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరసువంచి
నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓహ్ సైరా ఓ సైరా ఓ సైరా
యశస్సు నీకు రూపమాయారా
అహంకరించు ఆంగ్ల దొరలపైనా
హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బ్రతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు సౌర్యమా
శృంఖలాలనే తెంచుకొమ్మని
స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని
నినాదం నీవెరా
ఒక్కొక్క భిందువల్లే
జనులనొక్కచోట చేర్చి
సముద్రమల్లె మార్చినావురా
మార్చినావురా
ప్రపంచమోణికిపోవు
పెను తూఫాన్ లాగ వీచి
దొరల్ని ధిక్కరించినావురా
మొట్ట మొదటిసారి
స్వతంత్ర సమర భేరి
పెటిల్లు మన్నది
ప్రాజాలి పోరిది
కాళరాత్రి వంటి
పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓహ్ సైరా ఓ సైరా ఓ సైరా
యశస్సు నీకు రూపమాయారా
దాస్యాయన జీవించడం కన్నా
చావేన్తో మేలన్నది నీ పౌరుషం
మనుషులైతే మనం అణిచివేసే జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలని బిడ్డని అమ్మని జన్మని
బంధనాలన్నీ వొదిలి సాగుదాం
నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై
అటే వేయని ప్రతి పదం
కథన రంగమంతా
కథన రంగమంతా
కొదమ సింగమల్లే
కొదమ సింగమల్లే
ఆక్రమించి ఆక్రమించి
విక్రమించి విక్రమంచి
తరుముతుంది వారి వీర సంహారా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా