కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిల మిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
జోలాగా లాలించగా నీ నీడ దొరికింది
కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది
ఎద విల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే
గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
నీదే ఆ చెలి
నిజమేనా జాబిలీ
కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపు
ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు
ఒదిగి ఉండి నీ వాకిటిలో బదులు కోరి నే నిలుచున్నా
దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా
ఊరించే ఇది ఏ మాసం
ప్రేమించే ప్రతి గుండెను అందేలా సందడి చేసే హేమంతం ఇది
మన సొంతం ఐనది
కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిల మిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
ప ని ని స స ని ని ప ప మా మా గ గ స స గ మా గ మా గ దా
ప ని ని స స ని ని ప ప మా మా గ గ స స గ మా గ మా ప
మావి తోట మగ పెళ్లి వారికి విడిది అంది చిలక
మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక
జాబిలమ్మని జాజులతో తరలి రమ్మని అందామా
పేద మనసుకి పెళ్లంటే అతిధులెవ్వరు రారమ్మ
నీ కన్నా సిరుల మిన్నా
ఓ మైనా మన మనువు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
వధువై రానా మరి
కిల కిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిల మిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
జోలాగా లాలించగా నీ నీడ దొరికింది
కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది
ఎద విల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే
గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
నీదే ఆ చెలి
నిజమేనా జాబిలీ
Kila kila navve koyila kosam vacchindi madhumasam
Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram
Jolaga laalinchaga nee needa dorikindi
Kammaga kalaleeyaga nee thodu naakundi
Yeda villunu vanchina vaade nee ramudu annadi manase
Gudi thalupulu theeyaka munde varamicchenu devatha yedurai
Neede aa cheli
Nijamena jaabili
Kila kila navve koyila kosam vacchindi madhumasam
Yeduru choopulo yentha theepani theliyaledu munupu
Yeduru choodani intha haayini marichipodu manasu
Odigi undi nee vakitilo badulu kori ne niluchunna
Daari theliyani cheekatilo velugu choosi kaadantaanaa
Oorinche idi ye masam
Preminche prathi gundenu andela sandadi chese hemantham idi
Mana sontham ainadi
Kila kila navve koyila kosam vacchindi madhumasam
Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram
Pa ni ni sa sa ni ni pa pa ma ma ga ga sa sa ga maa ga maa ga daa
Pa ni ni sa sa ni ni pa pa ma ma ga ga sa sa ga maa ga maa pa
Maavi thota maga pelli vaariki vididi andi chilaka
Manuvu mundare manthanaalaki kadile goruvanka
Jaabilammani jaajulatho tharali rammani andaamaa
Peda manasuki pellante athidhulevvaru raaramma
Nee kanna sirulaa minnaa
O mainaa mana manuvu mecchina manasulu pettina sumuhurtham idi
Vadhuvai raanaa mari