ఓ కలనే కంటూ ఉంటే నిజమే నన్నే
కసిరే ఊహై ఆపెనా
ఇది నాకొద్దంటుంటే వదిలెయ్మంటే
మలుపే మానం కోరెనా
వెలుగే కోరు దారిలో చీకటి కమ్ముకొచ్చెనా
తప్పనిసరిగా చేయనా తప్పనిపించినా
నా మనస్సు మారి పొమ్మన్నా మనిషిగానే చూస్తున్నా
ఇవాళ ఇలాగ ఇదేమిటో సహించలేకున్నా
అందం అందం ఇంకొకరికి సొంతం అయినా
బంధం బంధం తెంచేసుకుపోతున్నా
పంతం పంతం వదలాలి ఇకపై పైనా
అంత అంతం నీకోసం అవ్వనా
ఆహా యే లెట్స్ గో
ఓ ఇంటిలోన దీపమల్లే వెలుగు ఆడబిడ్డరా
రోడ్డు మీద బొమ్మవోలె ఆరిపోయే సోదరా
లౌక్యమైన లేని మగువ అంతరంతమాయరా
ముచ్చటైన ఆమె కంట రక్తమంత కారెరా
పిలిచే ప్రణయం బ్రతుకే ప్రళయం
విధికే విలయం ఈ సమరమే సమరమేగా
పగిలే ప్రాణం రగిలే దేహం
మాటే మౌనం గమ్యమే శూన్యంగా
ఈ నిశీధి బాటలోన నా ఉషోదయం నీ ప్రేమ
నేనేదైనా చేయలేనా నీకై
నరకమంటి జాతకంలో మనమనేది స్వర్గలోకం
ఏ త్యాగాలనైనా చేస్తా ఇకపై
అందం అందం ఇంకొకరికి సొంతం అయినా
బంధం బంధం తెంచేసుకుపోతున్నా
పంతం పంతం వదలాలి ఇకపై పైనా
అంత అంతం నీకోసం అవ్వనా