ఆనందమానందమాయే మది ఆశల నందనమాయె
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగా తాకని
నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే
నువ్వు నడుచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్న
నిండు గుండె గుమ్మంలో తోరణంగా నేనున్నా
నీ వైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా
ఆనందమానందమాయే మాది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే
రాగాబాల రమ్మంటు స్వగాతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగా నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్ప చాటు లోకంలో కళల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీ కోసం ప్రేమను దాచి
రాగాలే రాసులు పోసి ఈ గీతం కనుక చేసి
శుభాకాంక్షలు పలకాలి నవ్వుల పువ్వుల మాలతో
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగా తాకని
నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే