హే సూర్య వంశ తేజమున్నా సుందరాంగుడు
పున్నమి చంద్రుడు
మా రాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు
జనం కొరకు ధర్మం కొరకు
జన్మెత్తినా మహానుభావుడు
వాడే శ్రీ రాముడు
హే రాములోడు వచ్చి నాడురో
దాని తస్సదియ శివ ధనుసు ఎత్తినాడురో
దాని తస్సదియ శివ ధనుసు ఎత్తినాడురో
నారి పట్టి లాగినాడురో
దాని తస్సదియ నింగి కెక్కు పెట్టి నాడురో
దాని తస్సదియ నింగి కెక్కు పెట్టి నాడురో
పెళ పెళ పేలు మంటూ ఆకాశాలు కూలినట్టు
బల బల బలుమంటూ దిక్కులన్నీ పేలినట్టు
విల విలమంటూ విల్లు విరిచి జనక రాజు అల్లుడయ్యారో
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్కటవుదామా
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్కటవుదామా
హే రాజ్యమంటే లెక్కలేదురో
దాని తస్సదియ అడవు బాట పట్టినాడురో
హే పువ్వులాంటి సక్కనోడురో
దాని తస్సదియ సౌక్యమంతా పక్కనెట్టారో
హే బలే బలే మంచిగున్నా
బతుకునంతా పానం పెట్టి
ఆలు మలుపుల గతుకులున్నా
మూళ్ళ దారిపట్టి తన కథనే
పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్కటవుదామా
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్కటవుదామా
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
హే రామ సక్కనోడు మా రామ సంద్రుడనట్ట
ఆడకల్లు తాకి కందిపోతాడంట
అందగాళ్ళకే గొప్ప అందగాడంట
నింగి నీలమై ఎవరికీ చేతికందంట
హే జీవుడల్లే పుట్టినాడురో
దాని తస్సదియ దేవుడల్లే ఎదిగినాడురో
దాని తస్సదియ దేవుడల్లే ఎదిగినాడురో
హే నెలదారి నడిచినాడురో
దాని తస్సదియ పూల పూజలందినడురో
దాని తస్సదియ పూల పూజలందినడురో
హే పదపదమని వంతెనేసి వెనుకడలి దాటినాడు
పదిపది తలలు ఉన్నవాడిని పట్టి తాట తీసినాడు
చేదు తలపుకి చావుదెబ తప్పదంటూ చూపినాడురో
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్కటవుదామా
మా రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగా అందరొక్కటవుదామా