తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామ చందురుని కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషి
తై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై దిదితై దిదితై
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
వెతికే మజిలీ దొరికేదాకా
కష్టాలు నష్టాలు యెన్నొచ్చిన క్షణమైనా నిన్నపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదురంటూ లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమే శ్లోకమై పలికించార మనిషి
తై దిదితై దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
అడివె అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారియ్యాదా
అటువంటి పాదాల పాదుకలకు పట్టాభిషేకమే కదా
ఆ రామ గాధను రాసుకున్నదే కాదా
అది నేడు నీకు తగుదారి చూపానందా
ఆ అడుగుల జాడలు చేరేపొద్దురా మనిషి
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి