• Song:  Sandhalle Sandhalle
  • Lyricist:  Sanapati Bharadwaj Patrudu
  • Singers:  Anurag Kulkarni,Mohana Bhogaraju

Whatsapp

సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నను మరవని చూపులెన్నెన్నో నను నడిపిన దారులెన్నెన్నో నను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే ముగ్గుమీద కాలు వెయ్యగానే రయ్యిమంటూ కయ్యిమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడత పాడెనంట గంగిరెద్దులాటలో డోలు సన్నాయంట పెద్ద పండగొచ్చెనోయంటూ ముస్తాబుఅయ్యింది చూడరా ఊరు ఇచ్చటా ఇంటిగడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికీ మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఓ ఓఓ దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోదా పాపం నేల మీది నుండి గాలిపటం నింగి దాకా దారమే తోకగా ఎగురుతుంది ఎడ్ల బండిపై ఎక్కు చిన్నా పెద్దా గోలగోల చెయ్యడం ఎంత బాగుందంట రోజు మారిపోయినాగాని తగ్గేది లేదంటా అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమందినొక్కసారి కలవడానికి చాలవంట మూడు రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఆ ఆఆ మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఓ ఓఓ సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sandhalle Sandhalle Sankranthi Sandhalle Angaranga Vaibhavamgaa Sankranthi Sandhalle Sandhalle Sandhalle Sankranthi Sandhalle Angaranga Vaibhavamgaa Sankranthi Sandhalle Mana Ooritho Samayaannilaa Gadipeyadam Oka Saradhaaraa Mana Vaaritho Kalisundadam Oka Varameraa Aa Aaa Nanu Maravani Choopulenno Nanu Nadipina Dhaarulennenno Nanu Malachina Ooru Ennenno Guruthulanichhinadhe Sandhalle Sandhalle Sankranthi Sandhalle Angaranga Vaibhavamgaa Sankranthi Sandhalle Sandhalle Sandhalle Sankranthi Sandhalle Angaranga Vaibhavamgaa Sankranthi Sandhalle Muggumeedha Kaalu Veyyagaane Rayyimantu Kayyimanna Aadapilla Mukku Meedhakochhe Kopam Bhogimanta Mundhu Nilchonundi Challagaali Ontine Vechhagaa Thaakuthondhi Thamburaalatho Chidatha Paadenanta Gangireddhulaatalo Dolu Sannaayanta Pedda Pandagochhenoyantu Musthaabu Ayyindhi Choodaraa Ooru Ichhataa Inti Gadapa Undhi Swaagathinchadaaniki Veedhi Arugu Undhi Maata Kalapadaaniki Rachhabanda Undhi Theerpu Cheppadaaniki Ooru Undhi Chintha Dheniki Mana Ooritho Samayaannilaa Gadipeyadam Oka Saradhaaraa Mana Vaaritho Kalisundadam Oka Varameraa Oo OoOo Debbalaatalona Odipothe Kodipunju Poyyimeeda Kooralaagaa Thaanu Maadipodhaa Paapam Nela Meedhi NUndi Gaalipatam Ningi Dhaakaa Dhaarame Thokagaa Eguruthundhi Edla Bandipai Ekku Chinna Peddaa Golagola Cheyyadam Entha Baagundhata Roju Maaripoyinnagaani Thaggedhi Ledhantaa Anthataa Sambaraale Vindhu Bhojanaalu Chesi Raavadaaniki. Nachhinattu Oorilona Thiragadaaniki Anthamandhinokkasaari Kalavadaaniki Chaalavanta Moodu Rojulu Mana Ooritho Samayaannilaa Gadipeyadam Oka Saradhaaraa Mana Vaaritho Kalisundadam Oka Varameraa Aa AaAa Mana Ooritho Samayaannilaa Gadipeyadam Oka Saradhaaraa Mana Vaaritho Kalisundadam Oka Varameraa Oo OoOo Sandhalle Sandhalle Sankranthi Sandhalle Angaranga Vaibhavamgaa Sankranthi Sandhalle Sandhalle Sandhalle Sankranthi Sandhalle Angaranga Vaibhavamgaa Sankranthi Sandhalle

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sreekaram
  • Cast:  Priyanka Arul Mohan,Sharwanand
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2021
  • Label:  Sony Music