అలపొద్దని పక్కకి వంచీ
నీవీ నింగిని నిలువున చించీ
మేఘమాలలో మెరుపులు తెంచీ
ధూళి గాలుల దురుసులు తెంచి
దూసుకొచ్చాను నీ ముందుకే
చెయ్యి అందించు చాటెందుకే
ఇది ఇది మాయా మాయా
ఇది నిజమా
మెలకువలాగే తోచే
తన మహిమా
ఏమి తెచ్చావు చుక్కల తోటలనుంచి
రెండు తోకచుక్కలు కోసుకొనచ్చా
నీ చెవుల చివరిలో గవ్వలుగా గుచ్చా
ఏమి తెచ్చావు వేకువ అంచుల నుంచి
ఎర్ర రంగు వెలుగులు దువ్వుకొనొచ్చా
నీ చెంప ఛాయతో చాల్లేదని విడిచా
కృష్ణబిలాన్ని వెంటేసుకొచ్చేది దేనికనీ
దిష్టి చుక్కగా నీ బుగ్గమీద దిద్దాలనీ
ఊహలో హాయి ఉన్న ఫలంగా
కళ్ళముందుంటే నమ్మేదెలా చెప్పుమా
విశ్వాసముంటే విశ్వాన్ని కూడా
శాశించగలదే నీలో ప్రేమా
ఇది ఇది మాయా మాయా
ఇది నిజమా
మెలకువలాగే తోచే
తన మహిమా