జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు
ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముండేలా
మంతరమేసిందే
తుళ్ళే కాలమే తెల్ల కాగితం
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో రంగవుతూ ఉందే
జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు
నీతో చెప్పే ఏ మాటైనా
నాకో జ్ఞాపకమే
మౌనం కూడా ఇంకో జ్ఞాపకమేలే
తియ్యని జ్ఞాపకమే ఇది తగువు
చల్లని జ్ఞాపకమే ఇది నగవు
చేతులు చాచిన వయసుకి
కౌగిలి వెచ్చని జ్ఞాపకమే
నువ్వు మేఘానివై తాకే చోటులో
ఒక్కో జ్ఞాపకం ఒక్కో చినుకవుతోందే
జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు
నీపై ఇష్టం పెంచే పయనం
నాకో జ్ఞాపకమే
ఆపై మజిలీ ఇంకో జ్ఞాపకమేలే
ఆశకి జ్ఞాపకమే ప్రతి స్పర్శ
ధ్యాసకి జ్ఞాపకమే ప్రతి వరసా
నీ పెదవంచుకి నా పెదవంచుల
లాలన జ్ఞాపకమే
నువ్వే నేనుగా తోచే వేళలో
ఒక్కో జ్ఞాపకం ఒక్కో గ్రంధమయ్యిందే
ఒక్కో జ్ఞాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముండేలా
మంతరమేసిందే
తుళ్ళే కాలమే తెల్ల కాగితం
ఒక్కో జ్ఞాపకం
ఒక్కో రంగవుతూ ఉందే
జ్ఞాపకాలు కొన్ని చాలు
ఊపిరున్నన్నాళ్ళు గుండెల్లో పూలు
జ్ఞాపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే లోపలి దీపాలు