ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం
వెతికె తీరమె రానంది
బతికె దారినె మూసింది
రగిలె నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమె నీడగా మారింది
ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం
జ్ఞాపకం సాక్షిగా పలకరించవు ప్రతి చోట
జీవితం నీవని గురుతు చేశావు ప్రతి పూట
ఒంటిగా బ్రతకలేనంటూ వెంటతరిమావు ఇన్నాళ్లు
మెలుకువే రానీ కలగంటు గడపమన్నావు నూరేళ్లు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే కానీ ఊపిరిగా సొంతం కాదా