నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా
అనురాగమే నేరమా
స్నేహమే ద్రోహమా కాన రాని దైవమా
బలికోరటం న్యాయమా
బంధమే ఈ వేళా తెంచుకు పొతే
కన్నీరే ఏరై పారెనా
నేస్తమే ఈనాడు శత్రువు అయితే
చితి మంటే కాదా లోలోనా
నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా
అనురాగమే నేరమా
రావే ఓ చిరు గాలీ నీవే గాలించాలి
నీడే దూరం అయినదే
మేఘం నింగిని వీడి ఎంతో దూరం పోదే
స్నేహం దూరం అయినదే
ఆ దేవుడు లేని ఆలయములా
కెరటం లేని సాగరంలా
ఊపిరి లేని గుండె లయలా
నేస్తము లేకా ఉండగలనా
ఓ బ్రహ్మయ్యా నా కంటి పాపను చేర్చి
గుండె కోత తీర్చయ్యా
నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా
అనురాగమే నేరమా
స్నేహమే ద్రోహమా కాన రాని దైవమా
బలికోరటం న్యాయమాయే
బంధమే ఈ వేళా తెంచుకు పొతే
కన్నీరే రాయి పారెనా
నేస్తమే ఈనాడు శత్రువు అయితే
చితి మంటే కాదా లోలోనా