ర ర లింగ రా రా లింగా
కథ సెబుతా ఖచ్చితంగా
రారా లింగా రామ లింగ
ఇనుకోరా సుబ్బరంగా
పైకి సూత్తే ఎంతో సురుకు
లోన మాత్రం లేదు సరుకు
ఊరు మొత్తం ఇంతేనయ్యో
తళుకు బెళుకు
ఆహ ఏమి ఊరు
సిత్రం దీని తీరు
అట్టా ఎట్టా కూతలు కూస్తారంట
కోతలు కోస్తారంట అన్నింటా
అడ్డం తిరిగిన కథని సూస్తు
అసలు కదలక ఉందురు
కల్లో రయ్యని ఉరకలేస్తూ
అలుపు అలుపని అందురు
బొక్కబోర్లా పడినా దర్జాగా లేచి
దాన్నో ఆసనమందురు ఓహో
ఆహ ఏమి ఊరు సిత్రం దీని తీరు ఓ
సుత్తి కొడుతూ కొడుతూ ఉంటారు
నెత్తి పగిలే వరకు అంతేలే
కత్తి పదును తమదే అంటారే
ఉత్తి పగటి కలలే కంటారే
ఎగిరెగిరి పడుతూ ఎగుడుదిగుడుల
దారి తమదని తెలుసుకోనారె
ఆ నింగి నెల మాదే మాదే
అంటారే గాని అంతా సోదే
లోనున్న ఆశ పోనేపోదే
అలవాటులో పొరపాటుగా
మెలికేయదా మరి మనిషి బతుకే
ఆ ఆ ఆహ ఏమి ఊరు
సిత్రం దీని తీరు
ఆహ ఏమి ఊరు
సిత్రం దీని తీరు