నా కంటి పాపల్లో గలగల
కావేరీ పొంగే నీ లేఖ వల్ల
నా మనసులోతుల్లో ఇపుడిలా
మాగాని పండే నీ రాతవల్ల
చదివిన అక్షరాలన్ని
పెదవికి నవ్వు నేర్పాయే
చలి చలి గాలుల్లో వేసంగి
పూలే లోన పూచాయే
ఎప్పుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుతుందే ఆహ్వానం
నీకంత ఇష్టం పెరిగేటంతలా
నేనేమి చేశా తెలియదే
నేన్ నీకు సొంతం అనిపించేంతలా
యే మేలు చేశా తెలుపవే
అసలొక ఆచూకీ
వదలవే నాపైకి
పరుగున ఈరోజే
నీకేసి రానా
కొండలే దూకి
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు
ఎపుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుతుందే ఆహ్వానం