దత్తాత్రేయుని అవతరణం
భక్త బృంద భవతారణం
సద్గురు సాధమ సంగమం
సదానంద హృదయంగమం
ఎలావున్నాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రతా ఎవరని పార్వతి పరమేశుని అడిగింది
బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రిమహాముని పత్ని
అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి
అది విని రగిలిన ముగురమ్మలు అసూయ జలధిని మునిగి
అనసూయని పరీక్షింపగా తమ తమ పతులను పంపిరి
దత్తాత్రేయుని అవతరణం
భక్త బృంద భవతారణం
సద్గురు సాధమ సంగమం
సదానంద హృదయంగమం
అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులనాసతి కొలిచినది
దిగంబరంగా వడ్ఢయింపుమనిన దిగపతులను చూచి దిగ్బ్రాంతి చెందినది
కాల మూర్తులని చంటి పాపాలుగా మార్చి వివస్త్రగ వెలిగినది
పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించింది
పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మి సరస్వతి పార్వతులు పరితపించిరి
ఘొల్లుమనుచు పతి భిక్ష పెట్ట్టామని కొంగు చాచి యాచించిరి
అనసూయ పాతివ్రత్యముతో పలుకులొకటిగా బాసిలిరి
తమ తమ పతులెవరో తెలియక ముగ్గురామ్మరే మొరలిడిరి
ముగ్గురు మూర్తులకు ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరులంశా అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది
దత్తాత్రేయుని అవతరణం
భక్త బృంద భవతారణం
సద్గురు సాధమ సంగమం
సదానంద హృదయంగమం
సృష్టి స్థితిల కారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలాగా
అన్ని ధర్మముల ఆలవాలంగా ఆవు పృష్ఠమున అలరాగా
నాలుగు వేదముల నడవడిగా నాలుగు శునకముల నానుడిగా
సమర్థ సద్గురు వంశమే ఆ దత్తుని ఐదు వంశములై
ధారా వెలిగే ధర్మ జ్యోతులుగా
ధారా వెలిగే ధర్మ జ్యోతులుగా