మెల్లగా తెల్లారిందోయ్ అలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే
పసి పాపల్లా
చేదతో బావులలో గల గల
చెరువులో బాతులా ఈతల కల
చేదుగా ఉన్నవేపనునమిలేవేళ
చుట్ట పొగ మంచులో
చుట్టాల పిలుపులో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించు
అందించు హృదయం ల
చలిమంటలు ఆరేళ్ల
గుడి గంటలు మోగేలా
సుబ్రభాతలే వినవేళ
గువ్వలు వచ్చే వేళా
నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కానవేళ
పొలమారె పొలమంతా
ఎన్నాళ్ళో నువ్వు తలచి
కలమారె ఊరంతా
ఎన్నెల్లో నువ్వు విడచి
మొదట అందని దేవుడిగంట
మొదటి బహుమతి పొందిన పాట
రాయిలాలకు తహ తహ లాడిన
పసి తనమే గురుతొస్తుందా
ఇంతకన్నా తీయనైన జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎనో ఈ నిలయాన
నువ్వూగిన ఊయల ఒంటరిగా ఊగల
నువ్వేదిగిన ఏతే కనపడక
నువ్వడిన దొంగాట బెంగల్లె మిగలాల
నన్నెవరూ వెతికే విలేక
కన్నులకే తీయదనం
రుచ్చి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయేళ్ళే
పువ్వుల చెట్టుకి ఉందొ భాష
అలల మెట్టుకి ఉందొ భాష
అర్థమవ్వని వల్లే లేరె
అందం మాట్లడే భాష
పలకరింపే పులకరీంపై
పిలుపునిస్తే పరవసించడమే
మనసుకి తెలిసిన భాష
మమతలు పంచె ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కాదనేవాళ్లే లేరేవరు