రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే
రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే
మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట
వదిలెయ్ వదిలెయ్
కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంట
అడుగెయ్ అడుగెయ్
దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత
వలచేయ్ వలచేయ్
ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ
గెలిచేయ్ గెలిచేయ్
నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే
పల్లవించే కొంటె అల పడిలేస్తే అందం ఓఓ
పంచుకుంటే నవ్వు నీలా మనదే అనుబంధం
తుళ్ళిపడే కుర్రతనం తీరమెక్కడో చూద్దాం ఓఓ
తెల్లవారే తూరుపింట తొలి వెలుగవుదాం
నిన్న మొన్నలన్నీ గడిచెను వదిలెయ్
పాత రోజులన్నీ గతమేగా
నువ్వు నేను అన్న స్వార్ధం విడిచెయ్
చిన్ని చేతులన్నీ హితమేగా
స్వర్గమన్నదింకా ఎక్కడో లేదోయ్
స్వప్నమై ఉంది స్వతహాగా
సాహసాలు చేసే సత్తువ ఉంటే
మనకు సొంతమేగా
దారే లేదని తుది వరకు
దారి లేనే లేదని తడబడకు
తీరే మారదు అని అనకు
నీ తీరం దూరం చేరువరకు
రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే
మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట
వదిలెయ్ వదిలెయ్
కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంట
అడుగెయ్ అడుగెయ్
దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత
వలచేయ్ వలచేయ్
ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ
గెలిచేయ్ గెలిచేయ్
నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే