భగ భగ భగ భగ మండే
నిప్పుల వర్షమొచ్చినా
జన గణ మన అంటూనే
దుకే వాడే సైనికుడూ
పెళ పెళ పెళ పేలమంటూ
మంచు తుఫాను వచ్చినా
వెనకడుగేయ్ లేదంటూ
దాటే వాడే సైనికుడూ
దడ దడ దడమంటూ
తూటాలు దూసుకొచ్చిన
తన గుండెను అడ్డు పెట్టి
ఆపే వాడే సైనికుడు
మారణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడూ
సరిలేరు నీకెవ్వరూ
నువ్వెళ్ళే రహదారికి జోహారు ఓఓఓ
సరిలేరు నీకెవ్వరూ
ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు
కోట్ల మంది గుండెల్లో
దేర్యమనే జెండా నాటి
అండగా నేనున్నాను అని చెప్పేవాడే
సైనికుడు
ఈ దేశమే నా ఇల్లంటూ
అందరూ నావాళ్లంటూ
కులం మతం బేధాలను
భస్మం చేసేవాడే
సైనికుడు
చెడూ జరగని పాగా పెరగని
బెదరిదగని సైనికుడు
అలుపెరగని రక్షణ పని
చెదరనివ్వని సైనికుడు
మారణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడూ
సరిలేరు నీకెవ్వరూ
నువ్వెళ్ళే రహదారికి జోహారు ఓఓఓ
సరిలేరు నీకెవ్వరూ
ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు