• Song:  Ne tolisariga
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Usha

Whatsapp

నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా ఎక్కడవాలను చెప్పు నువ్వే సావాసమా హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా వద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదలిన కధ వెతికే మనసుకు మమతే పంచుమా నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా తీయని రుచిగల కటిక విషం నువ్వేసుమా పెదవులపై చిరునవ్వుల దగా కనబడనీయవు నిప్పులసెగ నీటికి ఆరని మంటలు రూపమా నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ne tolisariga kalagannadi ninne kadaa naa kalleduruga nilchunnadi nuvve kadaa swapnama nuvvu satyama telchi cheppave priyatamaa mounamo madhura gaanamo tanadi adagave hrudayamaa intalo cheruvai antalo dooramai andavaa snehamaa Ne tolisariga kalagannadi ninne kadaa naa kalleduruga nilchunnadi nuvve kadaa rekkalu todigina talapunuvve kaada nestamaa ekkada vaalanu cheppunuvve savaasamaa haddulu cheripina cheliminuvai nadipe deepama vaddaku raakani aapakilaa anuraagamaa nadakalu nerpina aasevu kadaa tadabadaneeyaku kadilina kadha vetike manasuku mamate panchumaa Ne tolisariga kalagannadi ninne kadaa naa kalleduruga nilchunnadi nuvve kadaa prema neetho parichayame edo paapamaa amrutam anukoni nammatame oka shaapamaa nee odi cherina pratimadiki baadhe phalitamaa teeyani ruchigala katika visham nuvve sumaa pedavula pai chiru navvula dagaa kanapadaneeyavu nippula sega neetiki aarani mantala roopamaa haa nee aatemito enaatiki aapavu kadaa nee baatemito ye jantaki choopavu kadaa tenchukoneevu panchukoneevu inta chalagaatamaa cheppukoneevu tappukoneevu neeku idi nyayamaa perulo prarayama teerulo pralayamaa pantamaa bandhamaa nee aatemito enaatiki aapavu kadaa nee paatemio ye jantaki choopavu kadaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Santhosham
  • Cast:  Gracy Singh,Nagarjuna,Shriya Saran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music