ఏమైనదో ఏమో నాలో
కొత్తగా ఉంది లోలో
కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై
వుండాలనే నా చిగురాశనీ
లోలో పొంగే భావాలన్నీ
ఈ వేళిలా నీతో చెప్పాలనీ వున్నది
అందాల సిరిమల్లెపువ్వు
ఏమూలదాగావో నువ్వు
చిరుగాలిలా వచ్చి నీవు
ఎదలోన సడిలేపినావు
ఏదో రోజూ నీకై నువ్వు
ఇస్తావనే నీ చిరునవ్వుని
ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నానులే
నీ కోసం ఇలా