ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేలంట
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేలంట
ఈ సమయానికి తగు మాటలు
ఏమిటో ఎవ్వరిని అడగాలట
చాలా పద్ధతిగా భావం తెలిసే
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచే
సరదా పడదామంతే
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేలంట
పరవశమా మరీ ఇలా
పరిచయమంతా లేదుగా
పొరబడిపోకు అంతలా
నను అడిగావా ముందుగా
నేనేదో భ్రమలో ఉన్నానేమో
నీ చిరునవ్వేదో చెబుతోందని
అది నిజమే అయినా నాతో అనకు
నమ్మలేనంతగా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేలంట
తగదుసుమా అంటూ ఉంటెయ్
తలపు దుమారం ఆగదే
తొలి దశలో అంతా ఇంతేయ్
కలవరపాటు తేలదే
ఈ బిడియం గడియ తెరిచేదెపుడో
నా మదిలో మాట తెలిపేందుకు
ఇదిగో ఇదదే అనుకోమనకు
ఆశలెయ్ రేపగా
ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేలంట
ఈ సమయానికి తగు మాటలు
ఏమిటో ఎవ్వరిని అడగాలట
చాలా పద్ధతిగా భావం తెలిసే
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచే
సరదా పడదామంతే
చాలా పద్ధతిగా భావం తెలిసే
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచే
సరదా పడదామంతే