బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే
కమ్మిట్టులా అయిపోయానే
చాక్లెట్టులా నీ నవ్వునే చూసి నేను
హాట్ కేకులా మెల్టయ్యానే
ప్రతి రోజూ నీ కళ్ళనే
తొంగి తొంగి నే చూసే
ఆ కళ్ళు నన్ను పిలిచే వేళలో
ఇంకేం ఇంకేం కావాలే
చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా
నిన్న మొన్న లేని హాయే
నువ్వొచ్చాకే చుట్టేసిందే
నాకే నీను నచ్చేసానే
నన్నే నీకు ఇచ్చేసానే
నీ మాటల్లో మాయేదో గమ్మత్తుగుందే
ఏ బాటిల్ లో లేనంత మత్తుందిలే
రేయైన పగలైనా హాయైన దిగులైన
నాతోడు నువ్వుంటే నాకింక సమ్మతమే
చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా
నిదుర లేదే నేరం నీదే
హద్దే లేనీ ప్రేమే నాదే
ఇద్దరమొకటై బతికేద్దామే
వద్దనకుండా హత్తుకుపోవే
ఏ చోటున్న నీ గొంతే వినిపిస్తూ ఉందే
ఏ పాటిన్న రానంత కిక్కుందిలే
జగమంతా సగమైన క్షణమేను యుగమైన
ఈ వలపు మలుపుల్లో సతమతము సమ్మతమే
చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా
బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే
కమ్మిట్టులా అయిపోయానే