బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే
నను నడిపించే బలమే
చిట్టి తల్లి నీవే పుట్టుకంటె నీదే
దేవతల్లే నన్నే చేరుకుంటివే
గుండెపట్టనంత ప్రాణమంటే నీవే
నాన్న లాగా నన్నే ఎంచుకుంటివే
ఓ చంటిపాపనై
నీతో నన్ను ఆడనివ్వవే
నీ ఆట పాట ముద్దు ముచ్చట తీర్చనివ్వవే
నా ఆయువంత నువ్వు అందిపుచ్చుకుని
చిందులాడవే
బుజ్జికొండవే నా బుజ్జికొండవే
బుజ్జికొండవే నా బుజ్జికొండవే
బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే
నను నడిపించే బలమే
ఏదో జన్మలో అమ్మవే
నా పాపవైనావిలా నమ్మవే
లోకాన పూసే ప్రతి నవ్వు తీసి
పువ్వుల దండ చేసి నీకందించనా
నీకై కన్నకలలా ఉంది జీవితం
ప్రతి ఋతువు నీకై తేవాలి వసంతం
నా ఆనందాలకి అద్దం పట్టిన
కంటి చెమ్మవే
నా అదృష్టాలన్నీ భూమికి దించిన
బుట్ట బొమ్మవే
నా గుండెపైన చిందులాడ వచ్చిన
జాబిలమ్మవే
బుజ్జికొండవే నా బుజ్జికొండవే
బుజ్జికొండవే నా బుజ్జికొండవే
బంగారమే బంగారమే
నువ్వు నా వరమే
నీ క్షేమమే నీ సంతోషమే
నను నడిపించే బలమే
ఏదో జన్మలో అమ్మవే
నా పాపవైనావిలా నమ్మవే