గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
పదానిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో
నీ పెదాలు తప్ప
ఏ వారలు వద్దని
వినాలని ఉంది నువ్వే అంటె
ఈ క్షణాలు తప్ప
ఏ క్షణాలు వద్దని
అనాలని ఉంది నీతో ఉంటె
గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
పదానిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో
నిన్న మొన్న కంటే ఇవాళ
వెచ్చగుంది చూడు చలాకి ఊపిరి
నువ్వు ముందరుంటే ఇలాగ
కమ్ముతుంది చుట్టూ సుఖాల ఆవిరి
ఒహ్హ్ నీ కౌగిలింతలోన
ఖైదు చేసి హాయిగా
ఎంతెంత స్వేచ్ఛనిచ్చావు తీయగా
నా పేరు మీద నెల పైన
ఉన్న ఆస్థి నువ్వని
గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
పదానిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో
నువ్వు తప్ప వేరే ప్రపంచం
ఎందుకన్న ఊహ తయారయ్యింది లే
నువ్వు నన్ను నాకే మరోలా
చూపుతున్న లీల భలేగా ఉంది లే
నీ వేలు పట్టుకుంటే నిదురనయినా వీడను
నీ చేయి నిమురుతుంటే నిదుర లేవను
నా నీడ కూడా నన్ను వీడి
నిన్ను చేరుకుందని
గుస గుస లాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
పదానిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో