ధీం దినకుదిన ధీం అ ఆ ఆ
ధీం దినకుదిన ధీం ఆఆ
ధీం దినకుదిన ధీం హా ఆ ఆ
ధీం దినకుదిన ధీం హా హ హా
బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే రాధను చూశాడే
ఫ్లూటు లేని గోపాలుడే
సూటు వేసే భూపాలుడే
మీసమొచ్చిన బాలుడే
మాట వింటే పడిపోవుడే
కటిక చీకటిలో కన్ను కొడతడే
వెన్న ముద్దలని వెంట పడతడే
గోల చేస్తడే గాలమేస్తడే
మాయలోన వీడే
హోయ్ బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
అరెరెరె యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే రాధను చూశాడే
రోమియోలా క్యాపు పెట్టి
రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే
కాస్త సందు కాస్త సందు
ఇచ్చామంటే ఇచ్చామంటే
సూది లాగా గుండెలోకి దూరిపోతాడే
రంగురంగులా టింగు రంగడే
బొంగరమోలే తిరుగుతుంటడే
ఓరచూపులా గాలి పోరడే
పగటి దొంగ వీడే
హోయ్ బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే హెయ్
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే రాధను చూశాడే
హే తిక్కలోన్ని తిక్కలోన్ని
తిట్టాలంటూ తిట్టాలంటూ
ముద్దు పెదవికి ముచ్చటేసి
మూడు వస్తుందే
అయ్యబాబోయ్ అయ్యబాబోయ్
అంతలోనే అంతలోనే
వద్దు పోనీ అంటూ
మనసే అడ్డు పడుతుందే
అనగనగా మొదలైన ఈ కధ
కంచె దాటి ఏ కంచికెళ్తదో
ఏమౌతుందో ఏం చేస్తాడో
జాదూ గాడు వీడే
హమ్మో బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే కృష్ణుడు వచ్చాడే
హా ఆ ఆ యమునా తీరాన ఉన్న
రాధను చూసేసాడే
చూశాడే రాధను చూశాడే