నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరే వరం కోరే
పనేమీ లేదుగా
ఎడారి దారిలో
ఎదురయ్యే వానగా
తనంత తానుగా
కదిలొచ్ఛే కానుకా
నీస్పర్శే చెప్పింది
నే సగమేవున్నానంటూ
నీలో కరిగిననాడే
నేనంటూ పూర్తయినట్టు
ఇన్నాళ్లు ఉన్నట్టు
నాక్కూడా తెలియదు ఒట్టు
నువ్వంటూ రాకుంటే
నేనుండున్నా లేనట్టు
ఈ లోకంలో మనమే
తొలిజంటని
అనిపించే ప్రేమంటే
పిచ్చ్చే కథ
ఆ పిచ్చ్చే లేకుంటే
ప్రేమేధాని
చాటిస్తే తప్పుందా
నిజం కాదా
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరే వరం కోరే
పనేమీ లేదుగా
ఎడారి దారిలో
ఎదురయ్యే వానగా
తనంత తానుగా
కదిలొచ్ఛే కానుకా
ఎందుకు జీవించాలో
అనిపించిందంటే చాలు
యందుకు అంటూ నిన్నే
చూపిస్తాయి ప్రాణాలు
ఎవ్వరితో చెప్పొద్దు
మన ఇద్దరిదే ఈ గుట్టు
నువ్వే నా గుండెల్లో
గువ్వల్లే గూడును కట్టు
ఎటు వెళ్ళాలో వెతికే
పదాలకు
బదులై ఎదురొచ్చింది
నువ్వే కదా
నన్నెవ్వరికివ్వాలి
అన్నందుకు
నేనున్నానన్నది
నువ్వే కాదా