బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ
కంటి నిండా ఆశలతో మా సీతమ్మ
తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య
సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య
పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు
దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఇవ్వాల్టికి
ఆటలు పాటలు వేడుకలు
మాటకు మాటలు అల్లరులు
తియ్యని గుర్తుల కానుకలు
వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి
రా రండోయ్ వేడుక చూద్దాం
ఈ సీతమ్మని రామయ్యన్ని ఒకటిగా చేసేద్దాం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ నవేద్దాం
వారు వీరని తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం
పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం
ఇద్దరి కూడిక కాదు ఇది వందల మనసుల కలయికిది
ఈ సుముహూర్తమే వారధిగా
భూగోళమే చిన్నదవుతున్నది
రా రండోయ్ వేడుక చూద్దాం
వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ నవేద్దాం
కాలం కొమ్మపై మెరిసే నవ్వులై
కలిసే గువ్వలే బంధువులు
కదిలే దారిలో మెదిలే గురుతులై
నడిపే దివ్వెలే వేడుకలు
ఎపుడో తెలిసిన చుట్టాలు
ఇపుడే కలిసిన స్నేహితులు
మనసుని తడిమిన సంగతులు
కనువిందుగా ఉంది ఈ పందిరి
రా రండోయ్ వేడుక చూద్దాం
అయిన వాళ్ళందరం ఈ వెళిలా ఒక్కటిగా చేరాం
ఆడేద్దాం పాడేద్దాం నవేద్దాం ఆ నవేద్దాం