యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకె బిందె లాగ
ఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
సింత జట్టు ఎక్కి జిగురు కొయ్యబొతే
సేథీకి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
మల్లె పూల మధ్య ముద్దబంతి లాగ
ఎంత సక్కగున్నావే
ముత్తైదువా మెళ్ళో పసుపు కొమ్ములాగా
ఎంత సక్కగున్నావే
సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా
ఎంత సక్కగున్నావే
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకె బిందె లాగ
ఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
సింత జట్టు ఎక్కి జిగురు కొయ్యబొతే
సేథీకి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
రెండు కాళ్ళ సీనుకువి నువ్వు
గుండె షేర్లో దూకేసినావు
అలల మూటలిప్పేసినావు
ఎంత సక్కగున్నావే
లచ్చ్మి ఎంత సక్కగున్నావే
మబ్బు లేని మెరుపువి నువ్వు
నెల మీద నడిసేసి నవ్వు
నన్ను నింగి సేసేసి నవ్వు
ఎంత సక్కగున్నావే
లచ్చ్మి ఎంత సక్కగున్నావే
సెరుకు ముక్క నువ్వు కొరికి తింటే ఉంటే
ఎంత సక్కగున్నావే
సెరుకు గడకే తీపి ఋషి తెలిపినావే
తిరునాళ్లలో తప్పి ఎడ్సెటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిఱునవ్వు లాగ
ఎంత సక్కగున్నావే లంచమి ఎంత సక్కగున్నావే
గాలి పల్లకీలో ఎంకి ఆట లాగ
ఎంకి మాటలోనే తెలుగు మాటలాగా
ఎంత సక్కగున్నావే లంచమి ఎంత సక్కగున్నావే
కడవ నువ్వు నడుమున బెట్టి
కట్ట మీద నువ్వు నడిసొత్తా ఉంటే
సంద్రం నీ సంకెక్కినట్టు
ఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
కట్టెలమోపు తలకెత్తుకొని
అడుగు మీద అడుగెత్త ఉంటే
అడివి నీకు గొడుగట్టినట్టు
ఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
బురద సెలో వారి నాటు ఏత్థ ఉంటే
ఎంత సక్కగున్నావే లచ్చ్మి ఎంత సక్కగున్నావే
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం బొత్తనట్టు