ఐఫోను సేతుల పట్టి
హై క్లాసు సెంటే కొట్టి
హై హీల్సు చెప్పులు తొడిగి
టిక్క టిక్క బోతా ఉంటె
తిప్పుకుంటా పోతా ఉంటే
నా పానామాగదు పిల్ల
బెంగాలీ రసగుల్లా
నా పానామాగదు పిల్ల
దీవాళీ కాకారపుల్ల
రోలెక్సు గడి వెట్టి
రేబాను జోడు వెట్టి
రేమండ్సు సూటు తొడిగి
రేంజ్ రోవర్ల వస్తావుంటే
రయ్యి రయ్యిన వస్తావుంటే
నా పానామాగలె పిలగో
తెర్సుకుంది గుండెల గోడుగో
నా పానామాగదె పిలగో
తట్టుకునేదింకా ఎలగో
నీ పిప్పరమెంటు ఒళ్ళే
సప్పరించి పోయే దిల్లే
బూరె బుగ్గల్లో మెరుపల్లె
పెంచినాయే కరెంటు బిల్లే
నా బుజ్జి బంగారుకొండ
నీ పోలిక సల్లంగుండ
పోరి సోకే నువ్వుల ఉండా
ఆడుకోరా గిల్లి దండ
నడుముల్ల భూకంపాలు
సూపించదే రిక్టరుస్కేలు
నాభి లోతు సుడిగుండాలు
సుట్టుభూమి సూత్తె హాయి గండాలు
నా పానం నా పానం అరె అరె అరె
నా పానామాగదు పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పానామాగదు పిల్ల
బెంగాలీ రసగుల్లా
నా పానామాగదె పిలగో
తెర్సుకుంది గుండెల గోడుగో
నా పానామాగదె పిలగో
తట్టుకునేదింకా ఎలగో
నువ్వు కస్సున సూత్తే సాలు
ఆడుతలె సెయ్యి కాలు
నీ ఒంపుల ఫెవికాలు
అత్తుకున్నాయె రెండు కళ్ళు
ఇది రింగు రింగు పిట్ట
నీ పైనే వాలిందిట్ట
అందాల ఆనకట్ట
తెచ్చుకోరా ఒంపు మిట్ట
ఏమున్నవే కొరమీను
నీ నవ్వే ఓ విటమిను
నీ జల్లోనా జాస్మిను
నేనైయుంట రావే నా జాను
నా పానం నా పానం
నా పానామాగదె పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పానామాగదు పిల్ల
బెంగాలీ రసగుల్లా
నా పానామాగదె పిలగో
తెర్సుకుంది గుండెల గోడుగో
నా పానామాగదె పిలగో
తట్టుకునేదింకా ఎలగో
నా పానామాగదె పిల్ల
బెంగాలీ రసగుల్లా
నా పానామాగదె పిల్ల
దీవాళీ కాకారపుల్ల