గుచ్చి గుచ్చి గుండెలపైనే
పచ్చ బొట్టు రాసానే
పచ్చ బొట్టు నీ పేరైనా
మచ్చ లాగ చూసావే
నీ ప్రేమ దొరికిన సమయాన
కుడి కన్ను అదిరేనని అనుకున్న
ఎడం వైపు గుండెలే పగిలేలా
నా కలలన్ని చిదిమేసావే
ఎందుకే ఈ వేదన
ఊపిరాగే యాతన
నేస్తమా నువ్వు లేనిదే
లోకమంతా చీకటి కాదా
గుచ్చి గుచ్చి గుండెలపైనే
పచ్చ బొట్టు రాసానే
పచ్చ బొట్టు నీ పేరైనా
మచ్చ లాగ చూసావే
గుచ్చి గుచ్చి గుండెలపైనే
పచ్చ బొట్టు రాసానే
పచ్చ బొట్టు నీ పేరైనా
మచ్చ లాగ చూసావే
కల ఎంత కోసిన
ఎద గొంతు మూసినా
చెలి చేతి స్పర్శలో
చేదైన తియ్యనా
ఆకలేసి ప్రేమ అంటే
మనసు తుంచి పెట్టావే
అమ్మ కానీ అమ్మవు నీవై
అమృతాన్ని పంచావే
పూల దారి పరిచింది నువ్వే
వేలు పట్టి నడిపింది నువ్వే
వెలుగు చూపి నా కన్ను పొడవకే
కంటి లోన వున్నది నువ్వే
హ్మ్మ్
గుచ్చి గుచ్చి గుండెలపైనే
పచ్చ బొట్టు రాసానే
పచ్చ బొట్టు నీ పేరైనా
మచ్చ లాగ చూసావే
గుచ్చి గుచ్చి గుండెలపైనే
పచ్చ బొట్టు రాసానే
పచ్చ బొట్టు నీ పేరైనా
మచ్చ లాగ చూసావే
నిప్పు కాల్చినా
నీరు ముంచినా
ప్రేమ రంగు ఇది మారదులే
ఉరిమి చూసిన
తరిమి వేసినా
మది నీ ప్రేమను మరువదులే
రాక్షసుడ్ని మనిషిని చేసి
దేవత గ నిలిచావే
రాతి గుండె రాగం పలికే
కొత్త బాట చూపావే
స్వర్గమన్నది -ఒకటున్నది
పిలిచి చూపినది నీ నవ్వే
దూరమై ఇలా నరక మేమిటో
చూపుతోంది నువ్వే నువ్వే
గుచ్చి గుచ్చి గుండెలపైనే
పచ్చ బొట్టు రాసానే
పచ్చ బొట్టు నీ పేరైనా
మచ్చ లాగ చూసావే
నీ ప్రేమ దొరికిన సమయాన
కుడి కన్ను అదిరేనని అనుకున్న
ఎడం వైపు గుండెలే పగిలేలా
నా కలలన్ని చిదిమేసావే
ఎందుకే ఈ వేదన
ఊపిరాగే యాతన
నేస్తమా నువ్వు లేనిదే
లోకమంతా చీకటి కాదా