లాలాలాల లాలాలాల లాలాలాల
పల్లవించు తోలి రాగమే సూర్యోదయం
పరవసించు ప్రియా గానమే చంద్రోదయం
సరి కొత్తగా సాగు ఈ పాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నా పాటల తీగ తొలి పూత
నాలుగు దిక్కులా నా చిరు పాటలు అల్లుకొనే సమయం
రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం
పల్లవించు తోలి రాగమే సూర్యోదయం
పరవసించు ప్రియా గానమే చంద్రోదయం
లాలాలాల లాలాలాల లాలాలాల
పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కళల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించను నా పల్లవి పలుకులలో
ఇంద్రధనస్సు సైతం తనలో రంగులనే
ఇప్పటికిప్పుడే సప్త స్వరాలుగా పలికెను నాతోనే
పల్లవించు తోలి రాగమే సూర్యోదయం
పరవసించు ప్రియా గానమే చంద్రోదయం
బ్రతుకే పాటగా మారి బాటనే మార్చగా
వెతికే వెలుగు లోకాలే ఎదురుగ చేరగా
ఆణువణువూ ఎటు వింటున్న నా స్వరమే పలికే
అడుగడుగునా ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపననే
పాటల జగతిని ఏలే రాణిగా వెలిగే శుభవేళ
పల్లవించు తోలి రాగమే సూర్యోదయం
పరవసించు ప్రియా గానమే చంద్రోదయం
సరి కొత్తగా సాగు ఈ పాట
విని గాలులు ఆడే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నా పాటల తీగ తొలి పూత
నాలుగు దిక్కులా నా చిరు పాటలు అల్లుకొనే సమయం
రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం
లాలాలాల లాలాలాల లాలాలాల
లాలాలాల లాలాలాల లాలాలాల