నగుమోము తారలే
తెగి రాలె నేలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయె ప్రాయమే
కదిలేను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే
మోహాలనే మీరెంతలా ఇలా
మోమాటమే ఇక వీడెనులే
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్
కదలడమే మరిచెనుగా
కాలాలు మిమ్మే చూసి
అణకువగా నిలిచెనుగా
వేగాలు తాళాలేసి
ఎచటకు ఏమో తెలియదుగా
అడగనేలేని చెలిమిదిగా
పెదవులకేమో అదే పనిగా
నిమిషము లేవే విడివిడిగా
సమయాలకే సెలవే ఇక
పేరులేనిది ప్రేమకానిది
ఓ కధే ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్
రాధే శ్యామ్ రాధే శ్యామ్
మేఘాన్ని వదలని చినుకై
సంద్రాన్ని కలవని నదులై
పరిమితి లేనే లేని
ప్రణయమే ఎంత అందం
అసలు కొలవకా కాలం
మునిగి తేలే దేహాలే
తుదకు తెలియని దూరం
మరిచి కలిసెలే స్నేహం
ముగిసేటి గమ్యమే లైని పయనమిదే
మెరిసేటి అడుగులతోనే
ఓ కథ ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్
నగుమోము తారలే
తెగి రాలె నేలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయె ప్రాయమే
కదిలేను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే