గలగలా గాజుల సప్పుడు వింటే పిల్లా
వగ్గమేసేటోన్ని లగ్గమాడెయ్ రాదా పిల్లో ఓ ఓఓ
నీ మనసుకు నచ్చేటోడు యాడో పుట్టే ఉంటాడే ఏ ఏఏ పిల్లో ఓ ఓఓ
అందాల రాముల్లాంటి బంగారు బుల్లోడే
మందారం బుగ్గే మీటి ముద్దాడే సిన్నోడే
ఎవడే నాకోసం వరుడై పుట్టినవాడు ఎవడే
నాకోసం ఆశగ వేచినవాడు ఎవడే
నా కథకే నాయకుడయ్యే పిల్లాడు బూచాడు ఎవడే
ఈ బొమ్మకు రంగులుఅద్దే వాడు ఎవడే
ఈ కొమ్మకు హంగులుదిద్దే వాడు ఎవడే
నా మనసున మత్తే చల్లే చెలికాడు
రారా వేణుగోపబాల రాజిత సద్గుణ జయశీల
సార సాక్ష నేరమేమి మారు బాధ కోర్వనేలా
రారా వేణుగోప బాల రాజిత సద్గుణ జయశీల
సోగ్గాడు సుకుమారుడు భేషైన మగధీరుడు
మోజున్న యద చోరుడు నా పోరడు
నా తీపి ఊహల్లోకొచ్చేవాడు
నా లో న కోటి కళలను నా జూ గ్గా రేపెటోడు
మో హా లే మేలుకొల్పేవాడు ఊఊ ఊ
నా ఇంద్రుడు నా చంద్రుడు గడసరి గోవిందుడు
గోపాలుడు సరసపు శూరుడు నా కొంటె గ్రీకువీరుడు
ఎవడే నా ఇష్టం కష్టం తెలిసినవాడు ఎవడే
నే గీసిన గీతను దాటని వాడు ఎవడే
నా ప్రేమను ఇట్టే గెలిచే మొనగాడు బూచాడు ఎవడే
ఎవడే నాకోసం వరుడై పుట్టినవాడు ఎవడే
నాకోసం ఆశగ వేచినవాడు ఎవడే
నా కథకే నాయకుడయ్యే పిల్లాడు
గారాల గుణవంతుడు రాగాల శ్రీమంతుడు
నా ప్రేమ శశికాంతుడు
ఆగడు నూరేళ్ళు నా జంటే కోరేవాడు
ఏనాడు చేయి వదలక నా నీడై సాగేటోడు
నా ఈడు జోడు తానైనోడు ఊఊ ఊ
వేధించడు, సాధించడు అవి ఇవి ఆశించడు
శాశించడు సొగసరి కాముడు కవ్వించే ప్రేమలోలుడు
ఎవడే నా కల్లోకొచ్చే అల్లరి వాడు ఎవడే
నా ఒళ్ళో వాలి గిల్లేవాడు ఎవడే
నా మెళ్ళో హారం వేసే చిన్నోడు బూచాడు
ఎవడే నాకోసం వరుడై పుట్టినవాడు ఎవడే
నాకోసం ఆశగ వేచినవాడు ఎవడే
నా కథకే నాయకుడయ్యే పిల్లాడు