వాన వాన వెల్లువాయే కొండా కోన తుళ్ళిపోయే
చెలియా చూపులే చిలిపి జల్లులై మెనూ తాకగా
ఏదో ఏదో ఏదో హాయ్
వాన వాన వెల్లువాయే కొండా కోన తుళ్ళిపోయే
ప్రియుని శ్వాసలే పిల్ల గాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయ్
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహారాజుకి సొంతం
హూ తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నెలకదే ఆనందం
చివురుటాకులా చలికి వొణుకుతూ చెలియా చేరగా
ఏదో ఏదో ఏదో హాయ్
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా
వొడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరినా చీకటిలో చిరు గాలుల గోలా
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయ్