దోబూచులాటేలరా
దోబూచులాటేలరా గోపాలా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగా
చిరుగాలి నాపి నే నడిగా
ఆ యేటి గట్టునేనడిగా
చిరుగాలి నాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదూ
ఆకాశాన్నడిగా బదులే లేదూ
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ
ఎదలో రొద ఆగదయ్య
నీ అధరాలు అందించ రా గోపాలా ఆ
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిళ్ళో కరిగించ రా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
గగనమె వర్షించ
గిరి నెత్తి కాచావూ
గగనమె వర్షించ
గిరి నెత్తి కాచావూ
నయనాలు వర్షించ
నన్నెట్ట బ్రోచేవు
పోవునకన్నె నీ మతమ
నే నొక్క స్త్రీనే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికే నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ
ఎపుడూ నీవే అండ కాపాడా రా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా